ఒమన్‌లో 50 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు

ఒమన్‌లో 50 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు

మస్కట్‌:ఎడారి ప్రాంతాల్లో వాతావరణం రానున్న రోజుల్లో మరింత వేడిగా మారబోతోంది. కొన్ని చోట్ల 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకోవచ్చని పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ ఏవియేషన్‌ (పిఎసిఎ) అంచనా వేస్తోంది. సుల్తానేట్‌లోని వెస్టర్న్‌ ఏరియాస్‌లో ఈ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయి. ఉష్ణోగ్రతలు తీవ్ర రూపం దాల్చనున్న నేపథ్యంలో డైరెక్ట్‌ సన్‌లైట్‌ ఎక్స్‌పోజర్‌కి దూరంగా వుండాలని ప్రజలకు పిఎసిఎ సూచించింది. రానున్న మూడు రోజుల్లో డిజర్ట్‌ ఏరియాస్‌ అలాగే హజార్‌ మౌంటెయిన్స్‌ వెస్ట్‌ ఏరియాస్‌లో వాతావరణం 46 నుంచి 49 డిగ్రీలకు చేరుకోవచ్చు. డిజర్ట్‌ ఏరియాస్‌లో ఇది 50 డిగ్రీలను టచ్‌ చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలని ఒమన్‌ మిటియరాలజీ అథారిటీ సూచించడం జరిగింది. 

Back to Top