షార్జాలో ప్రముఖ రోడ్ 20 రోజులపాటు మూసివేత
- June 18, 2019
అల్ కులయ్యా మరియు అల్ మజారాహ్ ప్రాంతాల మధ్య షేక్ సుల్తాన్ బిన్ సక్ర్ అల్ కాసిమి వైపు వెళ్ళే వాహనదారులు ఇకపై ఒకింత అప్రమత్తంగా వుండాల్సి వస్తుంది. 22 రోజులపాటు ఈ రోడ్డులో పాక్షికంగా క్లోజర్‌ని అమలు చేస్తున్నారు. జూన్ 22 నుంచి జులై 11 వరకు ఈ పాక్షిక మూసివేత అమల్లో వుంటుందని షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ వెల్లడించింది. ఈ డైవర్షన్‌ని క్లోజర్ కంటే ఎక్కువగా అభివర్ణించారు. రెండు ఫేజ్‌లలో దీన్ని మెయిన్‌టెనెన్స్ చేయబోతున్నారు. అల్ కులయ్యా మరియు అల్ మజారా ప్రాంతాల మధ్య తిరిగే వాహనదారులకు ఈ కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయి. రోడ్ సైన్ బోర్డ్స్‌ని బట్టి వాహనదారులు తమ వాహనాల్ని నడపాల్సి వుంటుందని అధికారులు సూచించారు. ఆర్టీయే ఎప్పటికప్పుడు వాహనదారుల ఫిర్యాదుల్ని స్వీకరించడానికి సిద్ధంగా వుంటుందని వారు తెలిపారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







