జపాన్ లో భారీ భూకంపం.. సునామీ ప్రమాదంలేదన్న అధికారులు..

- June 19, 2019 , by Maagulf
జపాన్ లో భారీ భూకంపం.. సునామీ ప్రమాదంలేదన్న అధికారులు..

నిగట: జపాన్‌ను భారీ భూకంపం వణికించింది. మంగళవారం రాత్రి వచ్చిన ప్రకంపనలతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.7గా నమోదైంది. అయితే తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేసిన అధికారులు తాజాగా వాటిని ఉపసంహరించుకున్నారు. సునామీ వల్లే అవకాశంలేదని ప్రకటించారు.

మంగళవారం రాత్రి యమగట తీరంలో వచ్చిన భూకంపంతోప్రజలు భయంతో వణికిపోయారు. భూప్రకంపన ధాటికి ఇళ్లు ఊగిపోయాయి. జనం ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పలు చెట్లు, కరెంటు స్తంభాలు నేలకూలాయి. పలుచోట్ల భూమి బీటలు వారింది. భూకంపం వల్ల నీగట, యమగట, మియాగ్రీల్లో 15మంది గాయపడ్డారు. భూప్రకంపనల కారణంగా పలు ఇళ్లు దెబ్బతిన్నాయి.
భూకంపం కారణంగా యమగట, నిగట, ఇషికావాలోని నోటో ప్రాంతాలకు జపాన్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. సముద్రంలో ఏడు మైళ్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ముందు జాగ్రత్త చర్యగా బుల్లెట్ రైలు సేవలను నిలిపివేశారు. భూకంప ప్రభావిత ప్రాంతాల నుంచి వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నీగట, యమగట ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com