విస్తార ఎయిర్లైన్స్ వారి మాన్‌సూన్ సేల్
- June 18, 2019
భారత దేశంలో విమాన సర్వీసులు అందిస్తున్న మరో ప్రైవేట్ విమానయాన సంస్థ విస్తారా.ఈ సంస్థ దేశంలోని పలు నగరాలను విమాన సర్వీసులను నడుపుతోంది. ఇపుడు మాన్‌సూన్ సేల్ పేరుతో సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది.
ఈ ఆఫర్‌లో రూ.1299కే టిక్కెట్ ధరను ప్రకటించింది. అయితే, ఈ టిక్కెట్లను మంగళవారం అర్థరాత్రి నుంచి బుధవారం అర్థరాత్రి 11.59 గంటల వరకు మాత్రమే కొనుగోలు చేయాల్సి వుంటుంది. ఒక్క రోజు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. ఆ తర్వాత ముగిసిపోతుంది. ఈ ఆఫర్‌లో టిక్కెట్లు బుక్ చేసుకునేవారు జూలై 3వ తేదీ నుంచి సెప్టెంబరు 26వ తేదీ మధ్య ప్రయాణించే వెసులుబాటును కల్పించారు.
కాగా, ఇటీవల విస్తారా సంస్థకు 62 కొత్త విమానాలు వచ్చి కలిశాయి. దీంతో విమానాల సంఖ్య 170కి చేరింది. ఈ సంస్థ ప్రతి రోజూ 24 గమ్యస్థానాలకు రోజూ విమానాలు నడుపుతోంది. ముంబై నుంచి 10 నగరాలు అహ్మదాబాద్, చండీగఢ్, చెన్నై, వారణాసి, అమృత్‌సర్, ఢిల్లీ, గోవా, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా నగరాలకు విస్తారా నేరుగా సర్వీసులు అందిస్తోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..