నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు వీక్లీఆఫ్..
- June 19, 2019
ఏపీ పోలీస్ బాబాయ్‌ల దశాబ్దాల కల నెరవేరింది! ఇవాల్టి నుంచే వారికి వీక్లీ ఆఫ్‌లు అమలు చేస్తోంది జగన్ ప్రభుత్వం.పోలీసులకూ వీక్లీ ఆఫ్‌లు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి. అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిపై చర్యలు చేపట్టారు. సాధ్యాసాధ్యాలపై వేసిన కమిటీ రిపోర్ట్ ఇవ్వటంతో డీజీపీ గౌతమ్ సవాంగ్.. వీక్లీ ఆఫ్ అమలు తీరుపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. వీక్లీ ఆఫ్ అమలుకు మొత్తం 19 మోడల్స్ ఎంపిక చేశారు. యూనిట్ ఆఫీసర్లు ఏదో ఒక మోడల్ ని సెలక్ట్ చేసుకోవచ్చంటున్నారు ఉన్నతాధికారులు. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఇన్ స్పెక్టర్ స్థాయి వరకు దీన్ని అమలు చేస్తున్నారు.
ఎప్పుడు ఏ ఫోన్ కాల్ వస్తుందో తెలియదు. ఎక్కడ ఏం జరిగినా పోలీసులు అక్కడ ఉండాల్సిందే. వీఐపీలు వచ్చినా.. మీటింగ్ జరిగినా.. గొడవలు, పండగలు, జాతరలు ఇలా ఏ కార్యక్రమం జరిగినా పోలీసులు ఉండాల్సిందే. దీంతో పోలీసులకు సెలవులే దొరకడం లేదు. ఇక వీక్లీ ఆఫ్ సంగతి సరేసరి..! అయితే.. తమకు కూడా ఇతర ఉద్యోగుల్లాగే వీక్లీ ఆఫ్ ఇవ్వాలంటూ ఎన్నో ఏళ్లుగా కోరుతున్నారు పోలీసులు. ప్రభుత్వాలు మారాయి.. దశాబ్దాలు గడిచాయి కానీ.. పోలీసులకు వీక్లీ ఆఫ్ మాత్రం కలగానే మిగిలిపోయింది. కానీ.. కొత్తగా ఏర్పడిన జగన్ ప్రభుత్వం… ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చుకుంది. ఇవాల్టి నుంచి పోలీసుల బాబాయ్‌లకూ వీక్లీ ఆఫ్ లు అమల్లోకి తెచ్చింది.
పోలీసు శాఖలో ఇప్పటికే 12 వేల 300 ఖాళీలు ఉన్నాయి. వీక్లీ ఆఫ్ లు ఇస్తే సిబ్బంది కొరత సమస్య మరింత పెరుగనుంది. అయితే.. సిబ్బంది కొరత సమస్యను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై ఫోకస్ పెట్టారు పోలీసు అధికారులు. వీక్లీ ఆఫ్‌పై ప్రతి రెండు నెలలకు ఫీడ్ బ్యాక్ తీసుకొని మార్పులు చేర్పులు చేస్తామంటున్నారు ఇప్పటికే విశాఖ, కడప, ప్రకాశం జిల్లాలో ఈ ప్రయోగాత్మకంగా అమలవుతోంది. ఈ విధానంపై అధికారుల ఫీడ్ బ్యాక్ తీసుకుని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఏళ్లకు ఏళ్లుగా అమలుకు నోచుకొని వీక్లీ ఆఫ్ లను ఎట్టకేలకు అమలులోకి రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఏపీ సీఎం జగన్, డీజీపీ సవాంగ్ కు రుణపడి ఉంటామంటున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







