సేదతీరేందుకు యూరప్ వెళ్లిన చంద్రబాబు ఫ్యామిలి
- June 19, 2019
అమరావతి: ఈ తెల్లవారుజామున తన కుటుంబ సభ్యులతో కలిసి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు యూరప్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ఆయన ప్రత్యేక లేఖలో తెలిపారు. నేడు ఢిల్లీలో జరగనున్న పార్టీల అధ్యక్షుల సమావేశానికి తాను హాజరు కాబోవడం లేదని, ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం, తాను విదేశాలకు వెళ్లాల్సి వుందని అన్నారు ఈ సమావేశంపై తమ పార్టీ వైఖరిని తెలుపుతూ ఓ లేఖను టీడీపీ ఎంపీలకు చంద్రబాబు ఇవ్వాగా, వారు దీన్ని నేడు ప్రహ్లాద్ జోషికి అందించనున్నారు. తన కార్యక్రమం ముందుగా ఖరారై పోయిందని, ఆ తరువాతే సమావేశపు ఆహ్వానం తనకు అందిందని పేర్కొన్న చంద్రబాబు, అన్ని అంశాలపై తమ అభిప్రాయాలను తెలుపుతూ లేఖను పంపుతున్నట్టు తెలిపారు. కాగా, ఈ నెల 24 వరకూ చంద్రబాబు విదేశీ పర్యటన కొనసాగనుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..