ఈత సరదా, ఇద్దర్ని మింగేసింది
- June 19, 2019
మస్కట్: సముద్రంలో ఈత సరదా ఇద్దర్ని బలి తీసుకుంది. మరో ఆరుగుర్ని రాయల్ ఒమన్ పోలీసులు ప్రాణాలతో బయటకు తీశారు. విలాయత్ ఆఫ్ సీబ్ బీచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సీబ్‌లోని సూర్ అల్ హాదిద్ బీచ్ వద్ద సోమవారం ఈ ఘటన చోటు చేసుకోగా, కోస్ట్‌గార్డ్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. భారీ కెరటాల ధాటికి యువకులు సముద్రంలోకి కొట్టుకుపోయారు. వీరిలో ఆరుగుర్ని కోస్ట్‌గార్డ్ సిబ్బంది రక్షించగలిగారు. మరో ఇద్దరు మాత్రం ప్రాణాలు కోల్పోయారు. సముద్రంలో ఈతకొట్టేటప్పుడు అప్రమత్తంగా వుండాలని ఈ సందర్బంగా అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!