తల్లిదండ్రుల జేబులకు చిల్లులు పెడుతున్న విద్యాసంస్థలు
- June 19, 2019
తెలంగాణలో విద్యార్థుల తల్లిదండ్రుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి విద్యాసంస్థలు. ప్రతి ఏడాది నిబంధనలకు మించిన ఫీజులు పెంచుకుంటూ పోతున్నాయి. విద్యను పూర్తి వ్యాపారంగా మార్చేశాయి కార్పోరేట్.. ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్ని ఆందోళణలు చేసినా ఇటు స్కూల్ యాజమాన్యాలకు గాని.. అటు అధికారులకు గాని పట్టడం లేదు. ఫీజులను కట్టడి చేయాల్సిన ప్రభుత్వాలు సైతం నోరుమెదపక పోవడంతో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.
పాఠశాలల తీరుపై ప్రతియేటా విధ్యార్థుల తల్లిదండ్రులు రోడ్లపైకి వచ్చినా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోంది. అసోసియేషన్‌గా ఏర్పడి పోరాటాలు చేసినా ఫీజుల నియంత్రణ పై ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యం. కంటి తుడుపుగా తిరుపతి రావు అధ్యక్షతన కమిటీ వేసింది సర్కార్. ఈ కమిటీ వివిధ వర్గాలు.. విధ్యార్థిసంఘాలు.. తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపి రిపోర్ట్‌ను ప్రభుత్వానికి అందజేసింది. ప్రతియేటా పదిశాతం ఫీజులు పెంచుకోవచ్చంటూ రిపోర్టు రావడంతో.. యాజమాన్యాలు అందుకు తగ్గట్టుగా ఫీజుల మోతకు శ్రీకారం చుట్టాయి. స్లాబులు.. క్లాస్‌ల ఆధారంగా ఫీజులమోత మోగిస్తున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో చదింవించలేక.. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు భరించలేక నానా అవస్థలు పడుతున్నారు.
తెలంగాణలో విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనలకు మద్దతుగా నిలిచేందుకు బీజేపీ ముందుకొచ్చింది. ఫీజుల వ్యవహారంపై గ్రౌండ్ వర్క్ పూర్తిచేసిన పార్టీ.. పోరుబాట పట్టింది. ఇప్పటికే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి వివిధ సంఘాల అభిప్రాయాలు తెలుసుకుంది. ఇంటర్ నేషనల్.. గ్లోబల్.. పేర్లు పెట్టుకొని విధ్యాసంస్థలు బోదనలో ఆ విధానాన్ని పాటించకుండా ఫీజుల విషయంలో మాత్రం పక్కాగా పటిస్తున్నాయని ప్రభుత్వ లెక్షరర్ల సంఘం అధ్యక్షుడు మధుసుధన్ రెడ్డి విమర్శించారు.
ప్రేవేటు స్కూల్లలో ఫీజుల వసూలుపై ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారులకు గానీ ప్రభుత్వ పెద్దలకు కాని పట్టడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. ప్రభుత్వం కల్లు తెరిపించేవరకు తాము పోరుబాట పడతామని ఆయన హెచ్చరించారు.
ఇన్నాళ్లూ కేవలం విద్యార్థి సంఘాలు.. , పేరెంట్స్ ఆసోసియేషన్ల ఆందోళణలకే పరిమితం అయిన ఫీజుల తగ్గింపు వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.. ఇప్పటికైనా స్కూల్ యాజమాన్యాలు.. ప్రభుత్వ పెద్దలు ఫీజుల నియంత్రణకు శ్రీకారం చుడితే తమకు కాస్తా ఉపశమనం కలుగుతుంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







