సాల్మియా, జ్లీబ్‌లలో 500 మంది అక్రమ వలసదారుల అరెస్ట్
- June 20, 2019
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంఈరియర్ టీమ్ సాల్మియా మరియు జ్లీబ్‌లలో 500 మందికి పైగా అక్రమ వలసదారుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంటీరియర్ మినిస్ట్రీ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఫర్ జనరల్ సెక్యూరిటీ ఎఫైర్స్ లెఫ్టినెంట్ జనరల్ షేక్ ఫైజల్ అల్ నవాఫ్ అల్ సబా నేతృత్వంలో ఈ సోదాలు జరిగాయి. సాల్మియాలో 226 మందిని, జ్లీబ్ అల్ షుయోఖ్‌లో 296 మందిని అరెస్ట్ చేశారు. వీసా గడువు ముగియడం, స్పాన్సరర్స్ నుంచి తప్పించుకోవడం, సరైన పత్రాలు కలిగి లేకపోవడం వంటి ఉల్లంఘనల నేపథ్యంలో వీరిని అరెస్ట్ చేశారు. లేబర్స్ ఎక్కువగా వుండే ప్రాంతాల్లో ఈ తనిఖీలు తరచూ జరుగుతుంటాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు







