'కొబ్బరి మట్ట' రిలీజ్ డేట్
- June 20, 2019
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ నటించిన కొబ్బరి మట్ట చిత్రం ఎట్టకేలకి విడుదలకి సిద్ధమైంది. 2015లో కొబ్బరి మట్ట అనే చిత్రాన్ని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. పలు కారణాల వలన వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం జూలై 19న విడుదల కానుందంటూ టీం పోస్టర్ ద్వారా ప్రకటించింది. హృదయ కాలేయం టీం నుండి వస్తున్న ఈ చిత్రానికి రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పెదరాయుడు, ఆండ్రాయుడ్, పాపారాయిడు ఇలా మూడు విభిన్న పాత్రలలో కనిపించి సందడి చేయనున్నాడు సంపూ. కొబ్బరి మట్ట చిత్రానికి సంబంధించి గతంలో పలు సాంగ్స్, టీజర్ కూడా విడుదల చేశారు మేకర్స్. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కూడా ప్రేక్షకులని తప్పక అలరిస్తుందని టీం చెబుతుంది. 'హృదయ కాలేయం', 'సింగం 123' తర్వాత కొన్ని చిత్రాలలో సపోర్టింగ్ రోల్స్ చేసిన సంపూ ఇప్పుడు కొబ్బరి మట్ట చిత్రంతో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధమయ్యాడు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..