కింగ్‌డమ్‌లో యోగా వేడుకలు
- June 22, 2019
బహ్రెయిన్: అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో బహ్రెయిన్ కింగ్‌డమ్ యోగా ఔత్సాహికులతో కళకళ్ళాడింది. యోగా ఫెస్ట్ 21 పేరుతో ఖలీఫా స్పోర్ట్ సిటీ స్టేడియంలో నిర్వహించిన యోగా కార్యక్రమానికి పెద్దయెత్తున సందర్శకులు, ఔత్సాహికులు పోటెత్తారు. ప్రస్తుత సమాజంలో వివిధ కారణాలతో స్ట్రెస్ ఎక్కువవుతోందనీ, అనేక అనారోగ్య సమస్యలకు అధిక బరువు కారణమవుతోందనీ, యోగా వీటన్నిటికీ చక్కని పరిష్కారమని ఎంబసీ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరోపక్క, 24 ఇండియన్ ఆర్గనైజేషన్స్ సంయుక్తంగా యోగోత్సవ్ 19 పేరుతో షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ పార్క్ (అల్ హిద్ గార్డెన్స్)లో కార్యక్రమాన్ని నిర్వహించాయి. యూఏఈలో వేలాదిమంది రెసిడెంట్స్ యోగా మ్యాట్స్‌తోనూ, ప్రత్యేకంగా యోగా కోసం రూపొందించబడిన దుస్తుల్లోనూ యోగాసనాలు వేస్తూ యోగా పట్ల అవగాహన పెంపొందించే కార్యక్రమాలు చేపట్టారు. ఇండియన్ కాన్సులేట్ అబుదాబీ, దుబాయ్‌లలోనూ ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







