హౌతీ డ్రోన్‌ని కూల్చేసిన అరబ్ కొలిషన్
- June 26, 2019
సౌదీ అరేబియా: సౌత్ వెస్టర్న్ సౌదీ అరేబియాలో హౌతీ డ్రోన్‌ని కూల్చివేసినట్లు అరబ్ కోలిషన్ వెల్లడించింది. ఇరాన్ మద్దతుతో హౌతీ మిలీషియా ఈ డ్రోన్‌ని సౌదీ అరేబియా మీదకు ప్రయోగించిందని అధికారులు పేర్కొన్నట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ తెలిపింది. అరబ్ కోలిషన్ అధికార ప్రతినిథి కల్నల్ టుర్కి అల్ మాలికి మాట్లాడుతూ, పౌరులు ఎక్కువగా వుండే ప్రాంతాలే లక్ష్యంగా హౌతీ తీవ్రవాదులు దాడలుకు పాల్పడుతున్నట్లు చెప్పారు. తాజా ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని ఆయన వివరించారు. అత్యంత అప్రమత్తంగా వుంటూ ఎప్పటికప్పుడు హౌతీ దాడుల్ని ఎదుర్కొంటున్నామని అన్నారు కల్నల్ టుర్కి అల్ మాలికి.
తాజా వార్తలు
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!







