విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు
- June 27, 2019
ప్రపంచ క్రికెట్లో రికార్డుల రారాజు విరాట్‌కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 20వేల పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కాడు. విండీస్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో కోహ్లీ ఈ రికార్డ్ అందుకున్నాడు. కోహ్లీ 417 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయి అందుకోగా… గతంలో సచిన్ టెండూల్కర్, బ్రయాన్ లారా 453 ఇన్నింగ్స్‌లలో ఈ రికార్డ్ సాధించారు. దీంతో సచిన్,లారా రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. అలాగే ఈ మైలురాయి అందుకున్న మూడో భారత బ్యాట్స్‌మెన్‌గానూ ఘనత సాధించాడు. ఇంతకుముందు సచిన్ , ద్రావిడ్ మాత్రమే 20వేల పరుగుల ఫీట్ అందుకున్నారు. కోహ్లీ చాలా తక్కువ ఇన్నింగ్స్‌లలో 20 వేల పరుగులు పూర్తి చేశాడు. భారత కెప్టెన్ టెస్టుల్లో 131 , వన్డేల్లో 224 , టీ ట్వంటీల్లో 62 ఇన్నింగ్స్‌లు ఆడాడు.
తాజా వార్తలు
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు







