ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు
- June 27, 2019
ముంబై: ముంబై నుంచి అమెరికాలో నెవార్క్ వెళుతున్న ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఆ విమానాన్ని మార్గమధ్యంలోనే లండన్లోని స్టాన్ స్టెడ్ ఎయిర్పోర్టులో అత్యవసరంగా దింపివేశారు. ఎయిరిండియాకు చెందిన ఏఐ 191 విమానం గాల్లో ఉండగా విమానంలో బాంబులు అమర్చినట్లు బెదిరింపు సమాచారం అందింది. దీంతో బ్రిటన్కు చెందిన రాయల్ ఎయిర్ఫోర్స్ టైఫూన్ జెట్ విమానాలు ఎయిరిండియా విమానాన్ని అనుసరించాయి. పూర్తిగా తనిఖీలు చేసే సమయంలో రన్ వేపై ఇతర విమానాలను అనుమతించలేదు. విమానాశ్రయాన్ని కూడా మూసివేశారు. తనిఖీలు నిర్వహించి ఎలాంటి ప్రమాదం లేదన్న విషయం నిర్ధారించాకే విమానాశ్రయం కార్యకలాపాలు పునఃప్రారంభించారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







