స్వీట్‌ కార్న్‌ హల్వా

- January 04, 2016 , by Maagulf
స్వీట్‌ కార్న్‌ హల్వా

 కావలసిన పదార్థాలు: స్వీట్‌ కార్న్‌ - 1 కప్పు, పంచదార - అర కప్పు, పాలు - 1 కప్పు, గోధుమపిండి లేక బొంబాయి రవ్వ - అరకప్పు, నెయ్యి - పావు కప్పు, కిస్‌మిస్‌, జీడిపప్పులు - 10 చొప్పున.
తయారుచేసే విధానం: స్వీట్‌కార్న్‌లో పాలు కలుపుతూ మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. కార్న్‌ మిశ్రమంలో స్పూను నెయ్యి వేసి సన్నమంటపై పచ్చివాసన పోయేవరకు కలపాలి. తర్వాత పంచదార వేసి అది కరిగాక బొంబాయి రవ్వ, మిగతా నెయ్యి కూడా వేసి బాగా కలపాలి. రెండు నిమిషాల తర్వాత నెయ్యి రాసిన పళ్లెంలో పోసి డ్రైఫ్రూట్స్‌తో అలంకరించుకోవాలి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com