రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ చిన్నారుల్ని పరామర్శించిన అబుదాబీ పోలీస్
- June 28, 2019
అబుదాబీ పోలీస్ టీమ్, ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ చిన్నారుల్ని ఆసుపత్రుల్లో పరామర్శించారు. మొత్తం రెండు రోడ్డు ప్రమాదాలు 9 మంది చిన్నారులను గాయాలపాల్జేశాయి. గాయపడ్డవారికి షేక్ ఖలీఫా మెడికల్ సిటీలో వైద్య చికిత్స అందిస్తున్నారు. అబుదాబీ పోలీస్ సెంట్రల్ ఆపరేషన్స్ సెక్షన్ డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ సుహైల్ అల్ ఖైలి, అలాగే డిప్యూటీ డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ అహ్మద్ అల్ షెహి, ఇతర అధికారులు ఆసుపత్రుల్లో చిన్నారుల్ని పరామర్శించి, వారి యోగ క్షేమాల్ని అడిగి తెలుసుకున్నారు. సకాలంలో స్పందించిన సిబ్బందిని అభినందిస్తూ, విద్యార్థులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వాహనదారులు రూల్స్కి అనుగుణంగా వాహనాలు నడపాలని ఈ సందర్భంగా అబుదాబీ పోలీస్ అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..