'బందోబస్త్' ఫస్ట్ లుక్ రిలీజ్!
- June 28, 2019
కోలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హీరో సూర్య తెలుగు ఆడియన్స్ కి మంచి సుపరిచితుడు. ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగు లో డబ్ అవుతుంది. కొన్ని సినిమాలు అయితే సూపర్ హిట్ గా నిలిచాయి..అలాంటి వాటిలో సింగం సీరీస్ ఒకటి. తెలుగు హీరోలతో మంచి సాన్నిహిత్యంతో ఉండే సూర్య తాజాగా నటించిన మూవీ టైటిల్ రిలీజ్ అయ్యింది. హీరో సూర్య, మలయాళ స్టార్ మోహన్ లాల్, ప్రముఖ హీరో ఆర్య ప్రధాన పాత్రలలో కేవీ ఆనంద్ తెరకెక్కిస్తున్న మూవీ కప్పాన్.
యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న 'కప్పాన్' మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తెలుగులో కూడా సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. సినిమా తెలుగు టైటిల్ ని రాజమౌళి చేతుల మీదుగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. బందోబస్త్ అనే టైటిల్ తో తెలుగులో రిలీజ్ కానున్న ఈ సినిమాలో మోహన్ లాల్ - ఆర్య కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.
స్టూడియో గ్రీన్ పతాకంపై అల్లిరాజా సుభాష్‌కరణ్, కేఈ జ్ఞానవేల్ రాజాలు నిర్మిస్తున్న ఈ సినిమాకి హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. సాయేషా సైగల్.. సూర్య సరసన నటిస్తుంది. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఆగస్ట్ 15న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. NGK సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూర్య పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయాడు. మరి ఈ సినిమాతోనైనా హిట్టందుకుంటాడో లేదో చూడాలి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..