అంబులెన్స్‌కు దారివ్వలేదో భారీ ఫైన్ ...

- June 28, 2019 , by Maagulf
అంబులెన్స్‌కు దారివ్వలేదో భారీ ఫైన్ ...

న్యూ ఢిల్లీ:ఆఫీస్‌కి టైమైపోతోంది.. ఏ కాస్త సందు దొరికినా దూరేసి వెళ్లిపోవాలి. ఎనకా ముందు ఎవరొస్తే మనకేంటి.. అని అనుకున్నారో అడ్డంగా బుక్కైపోతారు. ఏదైనా ఎమర్జెన్సీ అయితేనే కదా అంబులెన్స్ ఫ్రిఫర్ చేస్తారు. అయినా కానీ మనకేం పట్టనట్టు ఉంటే ఎలా. అందుకే కేంద్ర ప్రభుత్వం అత్యవసర వాహనాలకు అడ్డు వస్తే 10 వేల రూపాయల జరిమానాతో పాటు డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేసే చట్టాలను తీసుకురానుంది. మరో వైపు మైనర్లకు వెహికల్స్ ఇచ్చినా, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినా, రాష్ డ్రైవింగ్ చేసినా శిక్షలు కఠినంగా ఉంటాయని అంటోంది కేంద్రం. తాగుతూ, తూలుతూ డ్రైవింగ్ చేసే వారికి కూడా సత్కారం మామూలుగా ఉండదంటోంది. ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినతరం చేసే ఉద్ధేశంతో ఇటీవల ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఈ నిబంధనలకు ఆమోదం తెలిపింది.

అంబులెన్స్‌కి అడ్డొస్తే 10 వేలు, లైసెన్స్ లేకుండా నడిపినా, డ్రంకెన్ డ్రైవ్ చేసినా 10 వేలు.. మైనర్‌లకు వెహికలిస్తే రూ.25 వేల జరిమానాతో పాటు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. ఇన్సూరెన్స్ లేకపోతే 2వేలు, హెల్మెట్ పెట్టుకోకుండా బండి నడిపితే వెయ్యి రూపాయలతో పాటు మూడు నెలల జైలు శిక్ష విధించే విధంగా చట్టాలు రూపొందించారు. ఇక బండి మీద రయ్ మని దూసుకెళ్లారనుకోండి.. మీ బండికి బ్రేకులు వేసి 1,000 నుంచి 2,000 లు కట్టి అప్పుడు కదులు అంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com