రాధిక, శరత్ కుమార్ లను అరెస్టు చేయండి : కోర్టు ఉత్తర్వులు
- June 30, 2019
చెన్నై: ప్రముఖ నటి రాధిక ఆమె భర్త తమిళ హీరో శరత్ కుమార్ లను అరెస్టు చేయమని కోర్టు పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.... తమిళ హీరో శరత్ కుమార్, అతని భార్య, నటి, నిర్మాత రాధికా శరత్ కుమార్ , మరో నిర్మాత లిస్టిన్ స్టీఫెన్ లు రెడియన్స్ మీడియా సంస్ధకు బాకీ పడిన రూ. 2కోట్లు ఇవ్వకపోవడంతో చెన్నై లోని సైదాపేట కోర్టు వారిని అరెస్టు చేయమని ఆదేశాలిచ్చింది.
రాధికా, శరత్ కుమార్, లిస్టిన్ స్టీఫెన్ లు కలిసి గతంలో కొన్ని సినిమాలు నిర్మించారు. ఆ సమయంలో రేడియన్స్ మీడియా సంస్ధనుంచి తీసుకున్న అప్పు రూ.2 కోట్లకు గానూ చెక్కును ఇచ్చారు. కాగా... ఆ చెక్కు బౌన్స్ అయ్యింది. దీంతో రేడియన్స్ మీడియా సంస్ధ రాధికా, శరత్ కుమార్, లిస్టింగ్ స్టీఫెన్ లపై చెన్నై సైదాపేట కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా శుక్రవారం రాధిక, శరత్ కుమార్, లిస్టింగ్ స్టీఫెన్ లు కోర్టుకు హాజరు కాలేదు. దీంతో న్యాయమూర్తి వీరిని అరెస్టు చేయాలని ఆదేశించారు,. ఈ కేసులో తదుపరి విచారణ జూలై 12 కి వాయిదా వేశారు, దక్షిణాదిన పలు భాషా చిత్రాల్లో నటించిన రాధిక పలు టీవి సీరియల్స్ కూడా నిర్నించారు.
రాధిక హీరోయిన్ గా సినిమాల్లో అవకాశాలు తగ్గుతున్నసమయంలో రాడాన్ మీడియా సంస్ధను స్ధాపించి టీవీ సీరియల్స్ నిర్మాణం ప్రారంభించారు. ఆమె నిర్మించిన సీరియల్స్ తమిళ, తెలుగు, మళయాళ భాషల్లో అత్యంత ప్రజాదరణ పొందాయి. రాధిక నిర్మించిన సీరియల్స్ ఎక్కువగా సన్ నెట్ వర్క్ లో ప్రసారం అవుతూ ఉంటాయి. రాడాన్ మీడియా సంస్ధ తమిళం, తెలుగు భాషల్లో సినిమాలు కూడా నిర్మించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..