దుబాయ్‌లో ఎంప్లాయర్‌ చెర నుంచి నలుగురు భారతీయ మహిళలకు విముక్తి

- July 01, 2019 , by Maagulf
దుబాయ్‌లో ఎంప్లాయర్‌ చెర నుంచి నలుగురు భారతీయ మహిళలకు విముక్తి

దుబాయ్‌లో తమిళనాడుకి చెందిన నలుగురు యువతుల్ని అక్రమంగా నిర్బందించిన ఎంప్లాయర్‌ నుంచి ఎట్టకేలకు విడిపించగలిగారు కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (సిజిఐ) మెంబర్స్‌. భారత విదేశాంగ శాఖ ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా విషయాన్ని వెల్లడించడం జరిగింది. కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలో హోస్టెసెస్‌గా పనిచేసందుకోసం తమిళనాడులోని కోయంబత్తూర్‌ నుంచి ఈ నలుగురు మహిళలు దుబాయ్‌ చేరుకున్నారు. అయితే, వారిని దుబాయ్‌లోని ఓ బార్‌లో డాన్సర్లుగా మారాలంటూ ఎంప్లాయర్‌ ఒత్తిడి చేశారు. కుటుంబ సభ్యులతో సంబంధాలు కోల్పోయిన యువతులు, అతి కష్టమ్మీద మినిస్ట్రీ ఆఫ్‌ ఎక్సటర్నల్‌ ఎఫైర్స్‌ని సంప్రదించగలిగారు. ఇ-మైగ్రేట్‌ సిస్టమ్‌ ద్వారా ఫ్రాడ్‌ స్పాన్సరర్స్‌ గురించి తెలుసుకునే అవకాశం వుందనీ, ఉద్యోగార్ధులు, ఉపాధి కోసం వచ్చేవారూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇండియన్‌ కాన్సులేట్‌ పేర్కొంది. ప్రవాసీ భారతీయ సహాయత కేంద్ర లేదా ఇండియన్‌ వర్కర్స్‌ రిసోర్స్‌ సెంటర్‌ ద్వారా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫ్రాడ్స్‌ గురించి తెలుసుకునే అవకాశం వుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com