హౌతీ ద్రోన్స్‌ని కూల్చేసిన అరబ్ కోలిషన్
- July 01, 2019
సౌదీ అరేబియా లక్ష్యంగా యెమెన్ నుంచి హౌతీ తీవ్రవాదులు సంధించిన రెండు డ్రోన్లను కూల్చివేసినట్లు సౌదీ నేతృత్వంలోని అరబ్ కోలిషన్ వెల్లడించింది. కోలిషన్ అధికార ప్రతినిథి కల్నల్ టుర్కి అల్ మాల్కి మాట్లాడుతూ, సదరన్ ప్రావిన్స్ ఆఫ్ అసిర్ వైపు రాత్రి 11.45 నిమిషాల సమయంలో రెండు డ్రోన్లు సివిలియన్లే లక్ష్యంగా దూసుకొచ్చినట్లు చెప్పారు. డ్రోన్లను విజయవంతంగా కూల్చేయడం జరిగిందనీ, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని కల్నల్ మాల్కి చెప్పారు. ఖసాఫ్ 2కె డ్రోన్స్ ద్వారా సౌదీలోని అభా అలాగే జిజాన్ ఎయిర్‌పోర్ట్‌లను టార్గెట్ చేసినట్లు హౌతీలకు చెందిన న్యూస్ ఛానల్ అల్ మసిరాహ్ వెల్లడించింది. ఇరాన్ మద్దతుతో హౌతీ తీవ్రవాదులు, సౌదీపై డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడులకు తెగబడుతున్నారు. జూన్ 12న జరిగిన మిస్సైల్ దాడిలో 26 మంది సివిలియన్స్ గాయపడ్డారు. జూన్ 23న జరిగిన దాడిలో ఒకరు ప్రాణాలు కోల&్పగా, 21 మందికి గాయాలయ్యాయి.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







