యూఏఈ రాయల్ మృతి: 3 రోజుల సంతాప దినాల ప్రకటన
- July 03, 2019
షార్జా: షార్జా రూలర్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి కుమారుడు షేక్ ఖాలిద్ బిన్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి యునైటెడ్ కింగ్‌డమ్‌లో మృతి చెందారు. ఆయన వయసు 39 సంవత్సరాలు. ఈ నేపథ్యంలో ఎమిరేట్ ఆఫ్ షార్జాలో 3 రోజులు సంతాప దినాల్ని ప్రకటించారు. తనయుడి మృతితో విషాదంలో మునిగిపోయిన డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమికి ప్రగాఢ సానుభూతి తెలిపారు సుల్తాన్ కబూస్ బిన్ సైద్. పలువురు రూలర్స్ ఈ సందర్భంగా షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ కేబుల్ ఆఫ్ కండోలెన్స్‌లను పంపారు. షేక్ సుల్తాన్ కుటుంబానికి ఈ కష్టం నుంచి కోలుకునే ధైర్యం ప్రసాదించాలని అల్లాని వేడుకుంటున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..