ఇంటర్ అర్హతతో టీటీ హబ్ ఆధ్వర్యంలో జాబ్ మేళా.. జులై 4న
- July 03, 2019
HRH నెక్టస్ సంస్థలో 400 కన్య్జూమర్ సర్వీస్ అసోసియేట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జాబ్ మేళాను నిర్వహించనున్నారు. టీటీ హబ్ ఆధ్వర్యంలో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు హబ్ ప్రతినిధి విశాల్ వెల్లడించారు. జులై 4వ తేదీన దోమల్ గూడలోని ఏవీ కాలేజీలో మేళా ఉంటుందని తెలియజేశారు. అభ్యర్థులు ఇంటర్ పాసై ఉండాలి. యవసు 19 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉన్న వారు అర్హులు. చదువుకునే విద్యార్థులకు పార్ట్ టైం జాబ్ చేసుకునే అవకాశం. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషలు తప్పనిసరిగా తెలిసి ఉండాలి. అర్హతలను బట్టి రూ.18వేల వరకు వేతనం ఉంటుంది. అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరయ్యే ముందు ఫోటో, బయోడేటా, ఆధార్, పాన్‌కార్డు తీసుకుని వెళ్లాలి. ఎంపికైన వారికి అక్కడే జాయినింగ్ ఆర్డర్ పత్రాలు ఇస్తారు. మరిన్ని వివరాల కోసం 8688721055,8688729671 నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







