100 మహిళా జవాన్ల పోస్టులకు రెండు లక్షల మంది దరఖాస్తు!
- July 04, 2019
రక్షణ దళాల్లోకి మహిళల ప్రవేశానికి కేంద్రం ఓకే చెప్పినప్పటి నుంచీ ఆ రంగం పట్ల మహిళలు ఆసక్తి పెంచుకుంటున్నారు. ఇందుకు ఉదాహరణగా నిలిచే ఘటన ఇది. వంద మహిళా జవాన్ల పోస్టులకు రెండు లక్షల మందికిపైగా మహిళలు దరఖాస్తు చేసుకోవడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మహిళలను రక్షణ రంగాల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత తొలిసారి ఆరుగురు మహిళలు భారత వాయుసేనలో చేరారు. ప్రస్తుతం వారు ఫైటర్ పైలట్లుగా శిక్షణ పొందుతున్నారు.
తాజాగా, కార్ప్స్ ఆఫ్ మిలటరీ పోలీస్ (సీఎంపీ)లో వంద జవాన్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయగా, ఆశ్చర్యకరంగా రెండు లక్షల మందికిపైగా మహిళలు దరఖాస్తు చేసుకుని ఆశ్చర్యపరిచారు. మరోవైపు, మహిళా ప్రొవొస్ట్ యూనిట్'లను పెంచుకునేందుకు సైన్యం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో ఇద్దరు అధికారులు, ముగ్గురు జూనియర్ కమిషన్డ్ అధికారులు, 40 మంది జవాన్లు ఉంటారు. ఇందుకు సంబంధించి తుది అనుమతులు రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆర్మీలో అధికారి స్థాయిలో మాత్రమే మహిళలు ఉన్నారు. వీరిని యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, యుద్ధ సేనలకు దూరంగా ఉంచుతున్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







