8న 'సాహొ ' ఫస్ట్ సింగిల్
- July 06, 2019
బాహుబలి చిత్రం తరువాత ప్రపంచం లో వున్న యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ అభిమానుల చూపంతా సాహో వైపు తిరిగింది. సాహో అప్‌డేట్స్ గ్యాప్ లేకుండా రావడం తో అభిమానుల చాలా ఆనందంగా వున్నారు. సోషల్ మీడియా లో అయితే వరల్డ్ వైడ్ గా ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమా నెక్ట్స్ అప్‌డేట్ కొసం సెర్చ్ విపరీతంగా జరుగుతుంది. ఈసారి చిత్ర యూనిట్ సాంగ్ టీజర్ ఇచ్చి పూర్తి సాంగ్ ని జులై 8న విడుదల చేస్తున్నాము అని ఎనౌన్స్ చేసింది. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. వీరి చూపంతా ఇప్పుడు జులై 8 వైపు కు మారింది.
. సైకొ సైయాన్ అని స్టార్టయ్యే ఈ సాంగ్ పూర్తి లిరికల్ విడీయో రిలీజ్ చేస్తామని తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో టాలీవుడ్ ప్రేస్టేజియస్ ప్రోడక్షన్ హౌస్ యువి క్రియెషన్స్ బ్యానర్ లో వంశి, ప్రమెద్, విక్రమ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జిబ్రాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేకంగా నిలవనుంది. ప్రతీ సీన్ ని ఎలివేట్ చేసే విధంగా వరల్డ్ క్లాస్ క్వాలిటీ రీ రికార్డింగ్ అందించనున్నారు జిబ్రాన్. ఇక ఈ సాహో చిత్రం ఇండిపెండెన్స్ డే కానుకగా అగస్ట్ 15 న ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ గా విడుదల కి సిద్ధమౌతోంది.
యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ఏ-విక్రమ్ లు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నటీనటులు.. రెబల్‌స్టార్ ప్రభాస్, శ్రధ్ధాకపూర్, జాకీషరఫ్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, లాల్, వెన్నెల కిషోర్, ప్రకాష్ బెల్వాది, ఎవిలిన్ శర్మ, చుంకి పాండే, మందిరా బేడి, మహేష్ మంజ్రేఖర్, టిను ఆనంద్, శరత్ లోహితష్వా తదితరులు..
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







