ఎండాకాలంలో చల్లగా ఉంటుందని ఎక్కువగా బీర్ తాగుతున్నారా..

- July 07, 2019 , by Maagulf
ఎండాకాలంలో చల్లగా ఉంటుందని ఎక్కువగా బీర్ తాగుతున్నారా..

సమ్మర్ వచ్చిందంటే చాలు.. ఆ వేడిని తట్టుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. ఇందులో మద్యంప్రియులు మాత్రం బీర్ బాటిల్ ఎత్తి.. దించకుండా తాగేస్తుంటారు.. దీని వల్ల కడుపులో చల్లగా ఉందంటూ సంబరపడతారు. ఎందుకిలా అంటే.. అవును బీరులో నీటిశాతం ఎక్కువగా ఉంది.. అది ఆరోగ్యానికి మంచిదంటూ చెప్పడం మరో విశేషం. అయితే ఇందులో ఎంతమాత్రం నిజం లేదని అంటున్నారు నిపుణులు. సాధారణంగా మానవశరీరంలో ఏడీహెచ్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది శరీరంలోని నీటిశాతాన్ని కంట్రోల్ చేస్తుంది. అయితే.. ఆల్కహాల్ కలిసిన బీర్‌ని తాగడం వల్ల ఈ హార్మోన్ దెబ్బతింటుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.

అసలు ఎండాకాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే అంతమంచిది. ముఖ్యంగా ఆల్కహాల్ జోలికి వెళ్లకపోవడమే ఉత్తమమని చెబుతున్నారు వైద్యులు. చల్లని బీర్ తాగడం వల్ల శరీరంలో వేడి చేస్తుందని.. ఇబ్బందులకు గురవుతారని హెచ్చరిస్తున్నారు. వీటికి బదులు పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు, మజ్జిగలాంటి పానీయాలు తీసుకుంటే మంచిదని చెబుతున్నారు.

డీహైడ్రేషన్ సమస్య నుంచి బయటపడాలంటే నీటిని ఎక్కువ తీసుకోవాలి కానీ, నీటిశాతం ఎక్కువున్న బీర్ కాదంటూ మరో కొత్త విషయాన్ని చెబుతున్నారు. కాబట్టి.. ఎండలున్నాయంటూ బీర్ బాటిల్స్ ఖాళీ చేసే మద్యంప్రియులు కాస్తా జాగ్రత్తగా ఉంటే మంచిదని చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com