ఎండాకాలంలో చల్లగా ఉంటుందని ఎక్కువగా బీర్ తాగుతున్నారా..
- July 07, 2019సమ్మర్ వచ్చిందంటే చాలు.. ఆ వేడిని తట్టుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. ఇందులో మద్యంప్రియులు మాత్రం బీర్ బాటిల్ ఎత్తి.. దించకుండా తాగేస్తుంటారు.. దీని వల్ల కడుపులో చల్లగా ఉందంటూ సంబరపడతారు. ఎందుకిలా అంటే.. అవును బీరులో నీటిశాతం ఎక్కువగా ఉంది.. అది ఆరోగ్యానికి మంచిదంటూ చెప్పడం మరో విశేషం. అయితే ఇందులో ఎంతమాత్రం నిజం లేదని అంటున్నారు నిపుణులు. సాధారణంగా మానవశరీరంలో ఏడీహెచ్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది శరీరంలోని నీటిశాతాన్ని కంట్రోల్ చేస్తుంది. అయితే.. ఆల్కహాల్ కలిసిన బీర్‌ని తాగడం వల్ల ఈ హార్మోన్ దెబ్బతింటుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.
అసలు ఎండాకాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే అంతమంచిది. ముఖ్యంగా ఆల్కహాల్ జోలికి వెళ్లకపోవడమే ఉత్తమమని చెబుతున్నారు వైద్యులు. చల్లని బీర్ తాగడం వల్ల శరీరంలో వేడి చేస్తుందని.. ఇబ్బందులకు గురవుతారని హెచ్చరిస్తున్నారు. వీటికి బదులు పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు, మజ్జిగలాంటి పానీయాలు తీసుకుంటే మంచిదని చెబుతున్నారు.
డీహైడ్రేషన్ సమస్య నుంచి బయటపడాలంటే నీటిని ఎక్కువ తీసుకోవాలి కానీ, నీటిశాతం ఎక్కువున్న బీర్ కాదంటూ మరో కొత్త విషయాన్ని చెబుతున్నారు. కాబట్టి.. ఎండలున్నాయంటూ బీర్ బాటిల్స్ ఖాళీ చేసే మద్యంప్రియులు కాస్తా జాగ్రత్తగా ఉంటే మంచిదని చెబుతున్నారు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..