ఆగస్టు-9 న `మన్మథుడు 2`
- July 10, 2019
అక్కినేని నాగార్జున నటించిన లవ్ అండ్ కామెడీ చిత్రం మన్మథుడు.అప్పట్లో సూపర్ హిట్ అయిన ఈ చిత్రానికి సీక్వెల్ మన్మథుడు-2. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో నాగార్జున, రకుల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్స్, వయకామ్ 18 స్టూడియోస్ పతాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిరణ్(జెమిని కిరణ్) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 9న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.
రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఆడియో విడుదలను త్వరలోనే నిర్వహించడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మంగళవారం ఈ సినిమాలో అవంతిక పాత్రలో నటించిన రకుల్ ప్రీత్ క్యారెక్టర్‌ను ప్రోమో రూపంలో రిలీజ్ చేశారు.
నాగ్ రకుల్ జతగా నటిస్తోన్న ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలంటే ఆగస్టు -9 వరకు వేచి చూడాల్సిందే మరి ఇక ఈ చిత్రం మన్మథుడు లాగా మంచి హిట్ అవుతుందా లేదా అన్నది చూడాలి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..