దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్: చెరో మిలియన్ డాలర్లు గెల్చుకున్న ఇద్దరు భారతీయులు
- July 09, 2019
దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ ర్యాఫిల్లో ఇద్దరు భారతీయులు చెరో 1 మిలియన్ డాలర్లు గెల్చుకున్నారు. ఇందులో ఒకరు జయా గుప్తా కాగా, ఆమె వయసు 71 ఏళ్ళు. గత ఇరవయ్యేళ్ళుగా ఆమె టిక్కెట్ కొనుగోలు చేస్తూనే వున్నారు. ఇన్నాళ్ళకు ఆమెకు అదృష్టం వరించింది. పూణేలో వుంటోన్న తన తల్లిని కలిసేందుకు మే 10న ఇండియాకి ఆమె వెళ్ళగా, ఈ క్రమంలో ఆమె కొనుగోలు చేసిన టిక్కెట్‌కి బహుమతి దక్కింది. టిక్కెట్ కొనడం తనకు హాబీ అనీ, ఎప్పుడూ తనకు బహుమతి తగల్లేదనీ, ఇది ఊహించని విషయమని ఆమె చెప్పారు. మరోపక్క, 37 ఏళ్ళ రవి రామ్‌చంద్ కూడా 1 మిలియన్ దిర్హామ్‌లు గెల్చుకున్నారు. 14 ఏళ్ళుగా దుబాయ్‌లో వుంటోన్న రవి రామ్‌చంద్, గార్మెంట్ బిజినెస్ నిర్వహిస్తున్నారు. గత పదేళ్ళుగా ఆయన కూడా టిక్కెట్స్ కొనుగోలు చేస్తున్నారు. ఈద్ సెలవుల సందర్భంగా క్రొయేషియాకి వెళుతూ లక్కీ టిక్కెట్‌ని కొనుగోలు చేసినట్లు చెప్పారాయన.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..