'పహిల్వాన్' గా సుదీప్
- July 10, 2019
ఎస్.కృష్ణ దర్శకత్వంలో పహిల్వాన్ అనే చిత్రం చేస్తున్నాడు కన్నడ నటుడు సుదీప్. ఈ చిత్రాన్ని స్వప్న కృష్ణ పహిల్వాన్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో కిచ్చ సుదీప్ పహిల్వాన్‌గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా కోసం పలు కసరత్తులు సైతం చేశాడు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తొలిసారిగా సుదీప్ ఈ సినిమాలో కుస్తీ వీరునిగా, బాక్సర్‌గా అభిమానులను అలరించబోతున్నాడు. ఆకాంక్ష సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో కబీర్ దుహాన్‌సింగ్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. స్టంట్స్ కోసం హాలీవుడ్ నుంచి లార్వెన్ సోహైల్ అనే నిపుణున్ని కూడా పిలిపించారు. అర్జున్ జన్యా సంగీతం అందించిన ఈ చిత్రం తెలుగులో పహిల్వాన్ అనే టైటిల్ తో విడుదల కానుంది. ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. కిల్లింగ్ లుక్స్ లో రియల్ పైల్వాన్లా సుదీప్ ఉన్నాడని చిరు అన్నారు. వచ్చాడయ్యో పహిల్వాన్ అనే సాంగ్‌ని రేపు సాయంత్రం 6.30ని.లకి విడుదల చేయనున్నట్టు పోస్టర్ ద్వారా ప్రకటించింది చిత్ర బృందం. ఆ పోస్టర్లో సుదీప్ లుక్ ఎంతగానో ఆకట్టుకుంటుంది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







