స్కామ్‌ మెసేజ్‌లపై బ్యాంక్‌ మస్కట్‌ హెచ్చరిక

- July 10, 2019 , by Maagulf
స్కామ్‌ మెసేజ్‌లపై బ్యాంక్‌ మస్కట్‌ హెచ్చరిక

మస్కట్‌: ఫ్రాడ్‌ మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా వుండాలంటూ బ్యాంకు వినియోగదారులకు బ్యాంక్‌ మస్కట్‌ సూచించింది. ఏటీఎం కార్డులు బ్లాక్‌ అయ్యాయని పేర్కొంటూ, ఓ నెంబర్‌ని కాంటాక్ట్‌ చెయ్యాలని సూచిస్తూ వాట్సాప్‌ ద్వారా వినియోగదారులకు మెసేజ్‌లు వస్తున్నాయి. కొన్నిసార్లు డైరెక్ట్‌ మెసేజ్‌లు కూడా అక్రమార్కుల నుంచి వస్తున్నాయి వినియోగదారులకు. నిజమేనేమోనన్న ఆందోళనతో సదరు నెంబర్‌కి కాల్‌ చేస్తే, ఆ తర్వాత బ్యాంకు అక్కౌంట్లు ఖాళీ అయిపోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి మెసేజ్‌లకు స్పందించరాదనీ, అనుమానాస్పద మెసేజ్‌ల విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్ళాలని బ్యాంక్‌ మస్కట్‌ సూచించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com