సమ్మర్‌ ట్రెయినింగ్‌ క్యాంప్‌ ప్రారంభం

- July 10, 2019 , by Maagulf
సమ్మర్‌ ట్రెయినింగ్‌ క్యాంప్‌ ప్రారంభం

బహ్రెయిన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హాస్పిటాలిటీ అండ్‌ రిటెయిల్‌ (బిఐహెచ్‌ఆర్‌), బిహెచ్‌ఆర్‌4 ఆల్‌తో కలిసి సమ్మర్‌ క్యాంప్‌ని డిఫరెంట్లీ ఏబుల్డ్‌ చిల్డ్రన్‌ కోసం ఏర్పాటు చేసింది. హ్యాండ్‌ పెయింటింగ్‌, ఫిట్‌నెస్‌, రీడింగ్‌, రైటింగ్‌, స్టోరీ టెల్లింగ్‌, మెడిటేషన్‌, యాక్టివిటీస్‌ ఆఫ్‌ డెయిలీ లివింగ్‌, కట్లెరీ వినియోగం, టేబుల్‌ లేయింగ్‌, బెడ్‌ మేకింగ్‌, కస్టమర్‌ సర్వీస్‌, పెయింటింగ్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌, డబ్బుల్ని వినియోగించడం వంటి విభాగాల్లో శిక్షణ లభిస్తుంది పార్టిసిపెంట్స్‌కి. బిఐహెచ్‌ఆర్‌ ఓ ప్రకటనలో ఈ విషయాల్ని పేర్కొంది. వాలంటీర్లు అలాగే మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌కి చెందిన సోషల్‌ వర్కర్స్‌, చిన్నారులకు శిక్షణ ఇస్తారు. బిహెచ్‌ఆర్‌4ఆల్‌ మరియు సిఎస్‌ఆర్‌ హీరోస్‌ ఫౌండర్‌ నివేదితా దడ్‌ఫాలే మాట్లాడుతూ, ఎన్నో ఏళ్ళుగా ప్రత్యేకావసరాలుగల వారితో కలిసి ప్రయాణం చేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో తాను చాలా నేర్చుకున్నట్లు తెలిపారు నివేదిత. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com