స్విమ్మింగ్‌ పూల్‌లో మునిగి రెండేళ్ళ చిన్నారి మృతి

స్విమ్మింగ్‌ పూల్‌లో మునిగి రెండేళ్ళ చిన్నారి మృతి

ఫ్యామిలీ స్విమ్మింగ్‌ పూల్‌లో మునిగికి రెండేళ్ళ చిన్నారి మృతి చెందిన ఘటన అబుదాబీలో చోటు చేసుకుంది. అల్‌ అయిన్‌లోని ఓ హౌస్‌ పూల్‌లో ఈ ఘటన చోటు చేసుకుందని అబుదాబీ పోలీసులు వెల్లడించారు. అల్‌ అయిన్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు సమాచారం అందగానే, సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు అధికారులు. జూన్‌లో కూడా ఇలాంటిదే ఓ ఘటన జరిగింది. రస్‌ అల్‌ ఖైమాలోని ఓ స్విమ్మింగ్‌ పూల్‌లో ఇద్దరు చిన్నారులు (కవలలు) నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ, నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటివి జరుగుతాయని చెప్పారు బ్రిగేడియర్‌ హుమైది. 

 

Back to Top