యూఏఈలో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి, 31 మందికి గాయాలు

యూఏఈలో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి, 31 మందికి గాయాలు

యూఏఈలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, 31 మంది గాయపడ్డారు. రస్‌ అల్‌ ఖైమాలోని షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ రోడ్డుపై బస్‌ ప్రమాదవశాత్తూ పల్టీలు కొట్టడంతో ఈ ఘోరం చోటు చేసుకుంది. మృతి చెందినవారిని ఆసియాకి చెందిన వలస కార్మికులుగా గుర్తించారు. ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని రస్‌ అల్‌ ఖైమా పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ - సెంట్రల్‌ ఆపరేషన్స్‌ బ్రిగేడియర్‌ మొహమ్మద్‌ సయీద్‌ అల్‌ హుమైదీ పేర్కొన్నారు. 

 

Back to Top