1,069 పోస్టులను భర్తీ కి తెలంగాణ ఆమోదం
- January 05, 2016
ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో భాగంగా వ్యవసాయ, భూగర్భ జలశాఖల్లో 1,069 పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. డెరైక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో ఈ నియామకాలు చేపట్టేందుకు టీఎస్పీఎస్సీకి అనుమతి ఇచ్చింది. వీటిలో అత్యధికంగా వెయ్యి వ్యవసాయ విస్తరణ అధికారుల (గ్రేడ్-2) పోస్టులున్నాయి. మిగతావన్నీ సాంకేతిక అర్హతలున్న పోస్టులే. కేటగిరీలవారీగా పోస్టుల సంఖ్యతోపాటు వాటి వివరాలను వెల్లడిస్తూ ఆర్థికశాఖ కార్యదర్శి శివశంకర్ మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.సంబంధితశాఖలు పంపించిన ప్రతిపాదనలను పరిశీలించటంతోపాటు వాస్తవ అవసరాలు, ఆర్థికంగా పడే భారమెంత అనే వివరాల్ని సమీక్షించి ఈ పోస్టులకు ఆమోదం తెలిపినట్లు ఆర్థికశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







