సి.ఆర్.పి.యఫ్ లో మహిళలకు 33% రిజర్వేషన్
- January 05, 2016
పారామిలటరీ దళాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగనుంది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్)ల్లో కానిస్టేబుల్ స్థాయి నియామకాల్లో ఇకపై మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించనున్నారు. అలాగే, సరిహద్దుల రక్షణ బాధ్యతలు నిర్వహించే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్), సశస్త్ర సీమాబల్(ఎస్‌ఎస్‌బీ), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ)ల్లోని కానిస్టేబుల్ స్థాయి నియామకాల్లో 15% మహిళలకు రిజర్వ్ చేయనున్నారు.తక్షణమే అమల్లోకి వచ్చేలా ఈ ప్రతిపాదనలకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదం లభించిందని మంగళవారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.ఈ దళాల్లో ప్రస్తుతం దాదాపు 9 లక్షల మంది సాయుధ సైనికులు ఉండగా, వారిలో 20 వేల మంది మాత్రమే మహిళలు. ప్రపంచంలోనే అతిపెద్ద పారామిలటరీ దళమైన సీఆర్‌పీఎఫ్‌లో 6300 మంది మహిళలే ఉన్నారు. శాంతి భద్రతల విధుల్లో, నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లలో సీఆర్‌పీఎఫ్‌ను వినియోగిస్తారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







