డియర్ కామ్రేడ్ ట్రైలర్ రిలీజ్ వేడుక..
- July 12, 2019
విజయ్ దేవరకొండ, రశ్మిక మండన్న జంటగా నటిస్తున్న చిత్రం డియర్ కామ్రేడ్. మైత్రీ మూవీస్ నిర్మాణంలో భరత్ కమ్మ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నెల 26న డియర్ కామ్రేడ్ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు. చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.కష్టసుఖాల్లో మన వెంట ఉండేవాళ్లు కామ్రేడ్స్. మీరంతా నాపై ఎంతో ప్రేమ చూపిస్తూ అభిమానిస్తున్నారు. మీరంతా నా కామ్రేడ్స్. సినిమా కోసం ఎంతో కష్టపడ్డాం. మంచి అవుట్‌పుట్ వచ్చింది. గతంలో సినిమా విడుదలైన రోజు కూడా ఆలస్యంగా లేచి ఫలితం ఎలా ఉందని అడిగిన రోజులున్నాయి. కానీ డియర్ కామ్రేడ్ విషయంలో చాలా ఉద్విగ్నంగా వేచిచూస్తున్నాను. నిద్రపట్టడం లేదు. మా సంగీత దర్శకుడు అందించిన పాటలు బాగున్నాయి. అందుకే మ్యూజిక్ ఫెస్ట్ నిర్వహించాలనుకుంటున్నాం. మీ దగ్గరకు వచ్చి ఆడి పాడతాం.
హైదరాబాద్‌తో పాటు చెన్నై, కొచ్చి, బెంగళూరులో మ్యూజిక్ ఫెస్ట్ నిర్వహిస్తాం. బెంగళూరులో జరిగే కార్యక్రమంలో రాకింగ్ స్టార్ యష్ పాల్గొంటారు. అన్నారు. రశ్మిక మండన్న మాట్లా డుతూ.ఈ సినిమా కోసం ఎక్కువ సమయం తీసుకున్నాం.
మూడు నెలలు కేవలం క్రికెట్ ఆట నేర్చుకునేందుకే వెచ్చిచ్చాం. మధ్య మధ్యలో ఓ పది నిమిషాల చిత్రీకరణ జరిపే వాళ్లం. డబ్బింగ్ నేనే చెప్పుకున్నాను. నాలుగు నెలల సమయం డబ్బింగ్‌కే పట్టింది.
బాగా ఏడ్వాల్సిన సన్నివేశాలున్నాయి. అలా ఇరవై రోజులు ఏడిపించారు. ఇంత కష్టపడ్డాం కనుకే సినిమా బాగా వచ్చింది. అని చెప్పింది.
దర్శకుడు భరత్ కమ్మ మాట్లాడుతూ.ఇదొక పెద్ద ప్రయాణం. మూడేళ్లుగా ఈ చిత్రంపై పనిచేశాం. ఈ మొత్తం ప్రయాణంలో సహకరించిన హీరోకు, నిర్మాతలకు కృతజ్ఞతలు. నేను మాట్లాడటం కంటే సినిమానే మాట్లాడుతుంది. అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు నవీన్ ఏర్నేని, రవిశంకర్, చెరుకురి మోహన్, యశ్ రంగినేని తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







