కువైట్‌లో మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు

కువైట్‌లో మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు

కువైట్‌: కువైట్‌లో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగనున్నాయి. మధ్యాహ్నం వేళల్లో ఉష్ణోగ్రతల తీవ్రత 47 నుంచి 49 డిగ్రీల వరకూ నమోదు కావొచ్చు. శుక్ర, శని, ఆదివారాల్లో ఇదే తరహా ఉష్ణోగ్రతలు కొనసాగుతాయి. ఉష్ణోగ్రతలకు వేడి గాలులు తోడవడంతో ప్రజలు ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి రావొచ్చు. పలు ప్రాంతాల్లో డస్ట్‌ ఎక్కువగా బ్లో అవుతుంది. గాలుల వేగం గంటకు 12 నుంచి 40 కిలోమీటర్ల వరకూ వుంటుందని వాతవరణ శాఖ అంచనా వేస్తోంది. సముద్రంలో కెరటాల తీవ్రత సాధారణంగానే వుంటుంది. ఇదిలా వుంటే, గాలుల తీవ్రత గంటకు 55 కిలోమీటర్ల వరకూ చేరుకోవచ్చు. 

 

Back to Top