వెలుగుచూసిన మరో దారుణం

వెలుగుచూసిన మరో దారుణం

80 ఏళ్ల వృద్ధురాలిపై 15 ఏళ్ల బాలుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన బీహార్‌లోని మధుబనిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బీహార్‌ మధుబనికి చెందిన 15 ఏళ్ల బాలుడు ఇంటి పక్కగా ఉంటున్న బంధువు 80 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. వృద్ధురాలు గట్టిగా అరవకుండా గుడ్డతో ఆమె నోటిని మూసేసే ప్రయత్నం చేశాడు. అయితే వృద్ధురాలి అరుపులు ఆమె ఇంట్లో వారికి వినపడటంతో అక్కడి వచ్చి చూశారు. వారిని చూడగానే బాలుడు పరుగులు పెట్టినప్పటికి దొరికిపోయాడు. వారు బాలుడ్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. వృద్ధురాలి అల్లుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా నిందితుడు మైనర్‌ కాదని, దొంగ సర్టిఫికేట్లతో అలా చిత్రీకరిస్తున్నారని వృద్ధురాలి అల్లుడు ఫిర్యాదులో పేర్కొనటం గమనార్హం.

 

Back to Top