2015 గిల్డ్ అవార్డ్స్ లిస్ట్ లో బాహుబలి...
- January 05, 2016
భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన భారీ చిత్రం బాహుబలి. ఈ సినిమా విడుదలై 7 నెలలవుతున్నా ఇప్పటికీ ఏదో ఒక సందర్భంలో బాహుబలి పేరు వార్తల్లో వినిపిస్తూనే ఉంది. ఇప్పటికే కలెక్షన్లతో పాటు అవార్డుల విషయంలో కూడా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్న బాహుబలి ఇప్పుడు మరో ఘనత సాధించింది.2015 గిల్డ్ అవార్డ్స్ లిస్ట్ లో స్థానం సంపాదించి మరోసారి వార్తల్లో నిలిచింది బాహుబలి. ఎవరు ఊహించని స్థాయి భారీచిత్రాన్ని రూపొందించినందుకు గాను ఈ ప్రత్యేక పురస్కారాన్ని ప్రకటించింది గిల్డ్ అవార్డ్స్ జ్యూరీ. ఈ సందర్భంగా అవార్డ్ ప్రధానం చేసిన ముఖేష్ భట్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. 'ఎవరు చేయలేని ఓ సాహసం చేసిన నిర్మాత, దర్శకుడు, చిత్రయూనిట్ గురించి మాట్లడటం ఎంతో గర్వంగా ఉంది.రాజమౌళీ.. నువ్వు మరిన్ని చిత్రాలతో మేము గర్వించేలా చేయాలి' అన్నారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







