భారత్ పై భగ్గుమంటున్న ట్రంప్
- July 12, 2019
భారత్-అమెరికా దేశాల మధ్య టారిఫ్ వార్ ఓ వైపు సాగుతుండగా..దీనికి ఆజ్యం పోస్తూ.. యుఎస్ లోని మల్టీనేషనల్ రిటెయిల్ కార్పొరేషన్..వాల్ మార్ట్… ఇండియామీద సరికొత్త ఆరోపణలు చేసింది.. ఈ-కామర్స్ కు సంబంధించి భారత నూతన పెట్టుబడి నిబంధనలు కఠినతరంగా ఉన్నాయని, తమ వాణిజ్య సంబంధాలను దెబ్బ తీసేవిగా ఉన్నాయని అమెరికాకు ఫిర్యాదు చేసింది. ఈ సంస్థ గత జనవరిలోనే ఈ మేరకు ఫిర్యాదు చేసినప్పటికీ.. తాజాగా ఇందుకు సంబంధించిన డాక్యుమెంటును రాయిటర్స్ కు అందజేసింది. ఇండియా తన కొత్త టారిఫ్ నిబంధనలను ఫిబ్రవరి 1 నుంచి అమలు చేసిన సంగతి తెలిసిందే. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 28 వస్తువులపై సుంకాలను పెంచింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం భగ్గుమన్నారు. భారత చర్య తమను ఆందోళనకు గురి చేస్తోందని, ఈ-కామర్స్ రెగ్యులేషన్స్ అత్యంత హార్ష్ గా ఉన్నాయని వాల్ మార్ట్ పేర్కొంది. భారత-అమెరికా దేశాలమధ్య ఈ నిబంధనలు కీలకంగా మారిన విషయాన్ని ఈ సంస్థ గుర్తు చేసింది. గతంలో ఇది ఈ-కామర్స్ జెయింట్ ఫ్లిప్ కార్ట్ పై 16 బిలియన్ యుఎస్ డాలర్లను ఇన్వెస్ట్ చేసింది. ఈ సొమ్ము వాల్డ్ లోనే ఒక సంస్థ మరొక దానిపై ఇన్వెస్ట్ చేసిన అత్యధికమైనదిగా పేర్కొంటున్నారు. రిటెయిల్ మార్కెట్లో వాల్ మార్ట్.. ఇండియాతో మంచి వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తూ వస్తోంది. అయితే అమెరికన్ సరుకులపై భారత ప్రభుత్వం సుంకాలను పెంచడంతో దాని ప్రభావం ఈ సంస్థపై కూడా పడింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







