టైర్లు పేలడంతో 110 మంది మృతి

- July 13, 2019 , by Maagulf
టైర్లు పేలడంతో 110 మంది మృతి

2018లో వాహనాల టైర్లు పేలడంతో చోటు చేసుకున్న ప్రమాదాల్లో 110 మంది ప్రాణాలు కోల్పోగా, 1,133 మందికి గాయాలయ్యాయి. మినిస్ట్రీ టాఫ్‌ ఇంటీరియర్‌ ఈ మేరకు నివేదిక విడుదల చేసింది. 'వార్న్‌ ఔట్‌ టైర్స్‌' కారణంగా 785 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. టైర్ల విషయంలో రెగ్యులర్‌ మెయిన్‌టెనెన్స్‌ చేయకపోవడం, ఓవర్‌ లోడింగ్‌.. ఈ ప్రమాదాలకు కారణం. టైర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు క్యాంపెయిన్‌ నిర్వహిస్తూనే వున్నారు ట్రాఫిక్‌ అధికారులు. తాజా క్యాంపెయిన్‌ సెప్టెంబర్‌ 1 వరకు నడుస్తుంది. దుబాయ్‌ పోలీస్‌ అసిస్టెంట్‌ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ మరియు చైర్మన్‌ ఆఫ్‌ ఎఫ్‌టిసి మేజర్‌ జనరల్‌ మొహమ్మద్‌ సైఫ్‌ అల్‌ జఫీన్‌ మాట్లాడుతూ, రోడ్‌ సేఫ్టీకి సంబంధించి సమ్మర్‌ సేఫ్టీ డ్రైవ్‌ అతి ముఖ్యమైనదని చెప్పారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com