బిగ్‌బాస్‌లోకి సావిత్రి..
- July 18, 2019
బిగ్‌బాస్.. షో మొదలైన తరువాత వివాదాలు వస్తాయి. అలాంటిది ఇంకా స్టార్ట్ అవకముందే బోలెడంత ప్రచారాన్ని మూటగట్టుకుంది బిగ్‌బాస్3. ఇక ఈ షోలో పాల్గొనే పార్టిసిపెంట్లు ఎవరెవరు అనేది ఫైనల్ లిస్ట్ ఇంకా రాలేదు. ప్రముఖ టీవీ యాంకర్ సావిత్రి బిగ్‌బాస్-3లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇదే విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో సావిత్రి పోస్ట్ చేసిన ఓ వీడియోలో తాను బిగ్‌బాస్3లో పాల్గొంటున్నట్లు తెలిపింది. అయితే, ప్రస్తుతం ఆ పోస్ట్‌ను మళ్లీ డిలీట్ చేసినట్లు సమాచారం. ఓ టీవీ చానెల్‌లో సావిత్రక్కగా ఫేమస్ అయిన శివజ్యోతి బిగ్‌బాస్‌లో ఎంటర్ అవుతున్నట్లు గత కొంతకాలంగా కథనాలు వినిపిస్తున్నాయి. 100 రోజులు సాగే ఈ షోలో 15 మంది ఇంటి సభ్యులు ఉంటారు . ఈ సారి షోలో సావిత్రితో పాటు, యాంకర్ శ్రీముఖి, నటి హేమ, వరుణ్ సందేశ్ ఆయన భార్య వితికా షేరు, జర్నలిస్ట్ జాఫర్, ఉయ్యాల జంపాల ఫేమ్ పునర్నవి భూపాలం, నటి హిమజ, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తదితరులు పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఆదివారం నుంచి వస్తున్న ఈ షోలో ఎవరెవరు వుంటారనేది త్వరలోనే తెలియనుంది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







