ప్రసార భారతిలో ఉద్యోగాలు..
- July 18, 2019
భారత ప్రభుత్వానికి చెందిన ప్రసార భారతిలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఉద్యోగాల కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఉద్యోగానికి ఎంపికైనవాళ్లు వేర్వేరు ప్రాంతాల్లో దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోకు డైరక్ట్ సేల్స్‌లో పనిచేయాల్సి ఉంటుంది. మొత్తం 60 పోస్టులుంటే అందులో.. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్-42, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్-1-18 పోస్టులు ఉన్నాయి. హైదరాబాద్‌లో 4, విజయవాడలో 2 పోస్టులు ఉన్నాయి. ఇవి ఒక ఏడాదికి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
అర్హత: మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు ఎంబీఏ (మార్కెటింగ్) లేదా పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ పాస్ కావడంతో పాటు డైరక్ట్ సేల్స్‌లో ఏడాది అనుభవం తప్పనిసరి. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు రూ.30,000, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్-1 పోస్టుకు రూ.42,000. వయసు: 35ఏళ్ల లోపు.. దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఆగస్ట్ 6
తాజా వార్తలు
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!







