ఘోర రోడ్డు ప్రమాదం..బాలనటుడు దుర్మరణం
- July 19, 2019
ఛత్తీస్‌గడ్‌లోని రాయ్‌పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలనటుడు శివలేఖ్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడు. పలు హిందీ ధారవాహికల్లో నటించిన శివలేఖ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రాయ్‌పూర్ పోలీసు సూపరింటెండెంట్ వివరాల ప్రకారం శివలేఖ్ ఫ్యామీలి కారులో బిలాస్‌పూర్ నుంచి రాయ్‌పూర్ వైపు వెళుతుండగా వేగంగా వచ్చిన ట్రక్కు వెనుక నుంచి వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివలేఖ్ అక్కడికక్కడే మరణించగా, అతని తల్లి లేఖ్నా సింగ్, తండ్రి శివేంద్రసింగ్ తోపాటు మరో వ్యక్తి కూడా గాయాలపాలయ్యారు. వీరిలో్ శివలేఖ్ తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ‘సంకట్ మోచన్ హనుమాన్’, ‘ససురాల్ సియర్ కా’ లాంటి సీరియల్స్‌తోపాటు అనేక టీవీ రియాల్టీ షోలలో శివలేఖ్ కనిపించారు. బాలనటుడి మృతితో ఇతర టీవీ అర్టిస్టులు విచారం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







