భారత వలసదారుడికి కిడ్నీ ఫెయిల్యూర్‌

భారత వలసదారుడికి కిడ్నీ ఫెయిల్యూర్‌

బహ్రెయిన్‌: సల్మానియాలో మొబైల్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న భారత వలసదారుడు అబూబాకర్‌, రెండు కీడ్నీలూ ఫెయిల్‌ కావడంతో సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఆయనకు ముగ్గురు పిల్లలున్నారు. కుటుంబ పెద్ద తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండడంతో, మొత్తం కుటుంబం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది. సన్నిహితులు కొంతమేర ధన సహాయం చేసినా అది సరిపోవడంలేదని సోషల్‌ వర్కర్‌ షబీర్‌ చెప్పారు. రమదాన్‌ మాసం తర్వాతి నుంచి అబూబాకర్‌ ఆరోగ్యం విషమించిందని, ఆసుపత్రిలో చేర్చగా రెండు కిడ్నీలూ చెడిపోయినట్లు వైద్యులు చెప్పారనీ షబీర్‌ వెల్లడించారు. తదుపరి వైద్య చికిత్స కోసం ఇండియాకి తరలించడం జరిగిందనీ, అయితే చికిత్స చాలా ఖరీదైంది కావడంతో, బాధిత కుటుంబం సాయం కోరుతోందని షబ్బీర్‌ వివరించారు. 

Back to Top