'పాడే ఉమారాణి' గారికి దుబాయ్‌ పోలీసుల సత్కారం

- January 06, 2016 , by Maagulf

 


వలసదారుల్లా అరబ్‌ దేశాలకు వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడుతున్న వారికి ఆపన్న హస్తం అందిస్తోన్న తెలుగు మహిళ పాడే ఉమారాణి గారి సేవల్ని గుర్తించిన దుబాయ్‌ పోలీసు ఉన్నతాధికారులు ఆమెను సత్కరించారు. దుబాయ్‌ పోలీసుల తరఫున ఉన్నతాధికారి మజీద్‌ అల్‌ సువేదీ ఉమారాణిని సత్కరించి, ఆమె సేవలకు గుర్తింపుగా ప్రశంసా పత్రాన్ని అందించారు. దుబాయ్‌లో దుర్భర జీవితం గడుపుతున్న తెలుగు పేదలకు చాలా సందర్భాల్లో దుబాయ్‌ పోలీసులు అండగా నిలిచారనీ, ఓ మహిళగా అక్కడ బాధపడ్తున్నవారిని ఆదుకునేందుకు తనవంతు సహాయం చేస్తున్నానని ఈ సందర్భంగా ఉమారాణి గారు చెప్పారు. ఉషారాణి పాడే గారు సికింద్రాబాద్‌ నుంచి వెళ్ళి దుబాయ్‌లో స్థిరపడ్డారు. ఎవరు కష్టాల్లో ఉన్నా తక్షణం స్పందించే ఉమారాణి గారు, దుబాయ్‌లో తెలుగువారికి అందిస్తున్న సామాజిక సేవను అక్కడివారు కొనియాడుతున్నారు. అలాగే దేశం కాని దేశంలో మనవారిని ఆదుకుంటున్న ఉమారాణి గారికి స్వదేశంలోనూ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 

మాగల్ఫ్.కామ్ టీం తరపున ఉమారాణి గారికి  ప్రత్యేక అభినందనలు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com