చైనాలో భారీ పేలుడు..10 మంది మృతి

చైనాలో భారీ పేలుడు..10 మంది మృతి

చైనా:శుక్రవారం సాయంత్రం చైనాలోని ఓ గ్యాస్ ప్లాంట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది మరణించగా,18 మందికి తీవ్రంగా గాయాలయ్యాయని, మరో 12 మంది గల్లంతయ్యారని చైనా మీడియా వాళ్ళు తెలియపరిచారు. ఈ ఘటన హెనన్ ప్రావిన్స్‌లోని యిమా పట్ణణంలోని హెనన్‌ కోల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లోని ఎయిర్‌ సస్పెన్షన్‌ విభాగంలో పేలుడు సంభవించినట్లు చైనా అధికారిక మీడియా పేర్కొంది.

ఈ ప్రమాధం వళ్ల చుట్టూ ప్రక్కల మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇల్లు తలపులు, అద్దాలు పగిలిపోయినట్టు అక్కడి స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదాన్ని చూసి అక్కడి ప్రజలంతా ఒక్క సారిగా భయాందోళనకు గురయ్యారని తెలియజేశారు.

బొగ్గు గనులు, గ్యాస్‌ ప్లాంట్లు, రసాయన పరిశ్రమలు ఉన్న చైనాలో తరచూ ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి.ఇటువంటి అత్యధిక పరిశ్రమలు ఉన్న చైనాలో భద్రతా ప్రమాణాలను మాత్రం నిర్లక్ష్యం చేస్తారనే ఆరోపణ ఉంది.

Back to Top