ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కన్నుమూత

ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కన్నుమూత

ఢిల్లీ:గతంలో ఢిల్లీ సీఎంగా పదవీలో కొనసాగిన షీలా దీక్షిత్ కన్ను మూశారు. కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మూడు సార్లు ఢిల్లీ సీఎంగా పనిచేశారు. 1998 నుంచి 2013 వరకు ఆమె ఢిల్లీ సీఎంగా పనిచేశారు. షీలా దీక్షిత్ ఒక పంజాబీ ఖత్రి కుటుంబంలో భారతదేశం యొక్క పంజాబ్ రాష్ట్రంలో కపుర్తలలో జన్మించారు. ఈమె న్యూఢిల్లీలోని జీసస్ అండ్ మేరీ స్కూల్ లో కాన్వెంట్ విద్యనభ్యసించారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నవో జిల్లాకు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్) గా పనిచేసిన వినోద్ దీక్షిత్ తో ఈమె వివాహం జరిగింది.

ఈమె భారత జాతీయ కాంగ్రెసు పార్టీ నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన మూడు వరుస ఎన్నికలలో విజయాన్ని సాధించి రికార్డ్ సృష్టించారు. ఈమె ఢిల్లీ శాసనసభలో న్యూఢిల్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఈమె డిసెంబరు 2013 శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయింది. దీక్షిత్ మహిళా సంఘం అధ్యక్షురాలిగా అయ్యారు మరియు 1970 లలో ఢిల్లీలో మహిళల పని కోసం అత్యంత విజయవంతమైన వసతిగృహాలు రెండు ఏర్పాటయ్యేందుకు కారణమయ్యారు. ఈమె తరువాత ఎగ్జిక్యూటివ్ కార్యదర్శిగా పనిచేశారు.
ఇటీవల జరిగిన ఎన్నికలల్లో నార్త్ ఈస్ట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1984 మరియు 1989 మధ్య కాలంలో, ఈమె ఉత్తరప్రదేశ్ కనౌజ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. పార్లమెంట్ సభ్యురాలిగా, ఈమె లోక్ సభ అంచనాల కమిటీకి సేవలందించారు. ఢిల్లీలో అప్పట్లో కంచుకోటలా కాంగ్రెస్ పార్టీని నిలిపారు. ఆమె మంచి అడ్మిసిస్ట్రేటర్ గా చెబుతుంటారు. షీలా దీక్షిత్ మరణ వార్త విని రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు. 

Back to Top