మురిసిపోతున్న అల్లు అర్జున్ డ్రైవర్
- July 22, 2019_1563771596.jpg)
అల్లు అర్జున్ టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరు. నచ్చినట్టుగా ఉండేదుకు నచ్చిన వస్తువును కొనేందుకు అల్లు అర్జున్ ఎప్పుడు ముందు వరసలో ఉంటాడు. అల్లు అర్జున్ తాను ఎప్పుడు ప్రత్యేకంగా ఉండేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతాడు. ఇటీవలే బన్నీ తనకోసం ప్రత్యేకంగా వ్యానిటి వ్యాన్ ను తయారు చేయించుకున్నాడు.
ఈ వ్యాన్ ఖరీదు దాదాపుగా రూ. 7 కోట్లు. ఇంటిఖరీదు పెట్టి వ్యాన్ కొన్న బన్నీ దీనిని అపురూపంగా చూసుకుంటున్నారు. ముంబైలో దీన్ని స్పెషల్ గా డిజైన్ చేయించారు. ఇండియాలో ఎక్కడ షూటింగ్ జరిగినా ఈ వ్యాన్ అక్కడికి వెళ్తుంది. దీంతో వ్యాన్ స్పీడ్ ను 80కిమీ గా లాక్ చేశారు.
హైట్ తక్కువగా ఉండటం దీని ప్రత్యేకత అని అల్లు అర్జున్ క్యారీవ్యాన్ డ్రైవర్ లక్ష్మణ్ అంటున్నాడు. మొదట లక్ష్మణ్ బోయపాటి దగ్గర పనిచేశారట. సరైనోడు సమయం నుంచి అల్లు అర్జున్ దగ్గర పనిచేస్తున్నారు. బన్ని దగ్గర పనిచేయడం చాలా బాగుందని అంటున్నాడు.
జీతం కంటే బన్నీ దగ్గర జీవితం బాగుందని చెప్తున్న లక్ష్మణ్.. డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు చెప్పాడు. ముంబైలో 15 నించి 20 రోజుకు శిక్షణ తీసుకున్నాడట. బెంజ్ కంపినీకి చెందిన వ్యాన్ కావడంతో అన్నింటిపై అవగాహనా వచ్చే విధంగా తర్ఫీదు పొందినట్టు లక్ష్మణ్ చెప్పాడు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..